హ్యాట్సాఫ్ పోలీసన్నలు... యాచకుడి మృతదేహానికి అన్నీ తామై అంత్యక్రియలు..!
పోలీసులంటే కాఠిన్యమే కాదు.. కరుకైన ఖాకీ దుస్తుల వెనక మనసున్న హృదయం కూడా ఉంటుందని నిరూపించారు. నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.

పోలీసులంటే కాఠిన్యమే కాదు.. కరుకైన ఖాకీ దుస్తుల వెనక మనసున్న హృదయం కూడా ఉంటుందని నిరూపించారు. నెల్లూరు జిల్లా కావలి పోలీసులు. పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద యాచకుడి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు...అభయం స్వచ్ఛంద సంస్థ సాయంతో అనాథ అయిన ఆ యాచకుడి పార్థివ దేహాన్ని శ్మశానానికి తరలించారు. అంతా తామే అయి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా కష్ట సమయంలో ఓ అనాథ శవానికి సంస్కారం నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, రైటర్ షఫీ, కానిస్టేబుల్ హరి, హోంగార్డు శ్రావణ్‌ను... సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కె. శ్రీనివాసరావు అభినందించారు. అలాగే అభయం స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడారు.
Next Story