కర్నూలులో రూ.9.24 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేసిన పోలీసులు

కర్నూలులో రూ.9.24 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేసిన పోలీసులు
కర్నూలు జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. గూడూరు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై మద్యం బాటిళ్లను వాహనాలతో తొక్కించారు.

కర్నూలు జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. గూడూరు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై మద్యం బాటిళ్లను వాహనాలతో తొక్కించారు. కోడుమూరు సర్కిర్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో సీజ్ చేసిన అక్రమ మద్యం నిల్వలు పేరుకోవడంతో బాటిళ్లను ధ్వంసం చేశారు. కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, గోనెగండ్లలో దాదాపు 155 కేసుల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 9లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిని గూడురు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలోని పోలకల్ సమీపంలో రోడ్‌పై వరుసగా పెట్టి బాటిళ్లను టిప్పర్లతో తొక్కించారు. SEC ఆదేశాల మేరకు మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని.. ఇంకా 20 లక్షల సీజ్ చేసిన మద్యం.. పోలీస్ స్టేషన్లలో ఉందని కర్నూలు డీఎస్పీ మహేష్‌ చెప్పారు. వాటిని కూడా త్వరలో ధ్వంసం చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story