Pawan Kalyan Office : పవన్ ఆఫీస్ పై డ్రోన్.. ఎవరు ఎగరేశారో తేల్చిన పోలీసులు

X
By - Manikanta |21 Jan 2025 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ డ్రోన్‌ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. రెండ్రోజులుగా ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోందని డీజీపీ తిరుమలరావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తోంది. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com