తిరుమల కొండపై సాక్షి మీడియా కుట్రలు

తిరుమల కొండపై సాక్షి మీడియా కుట్రలు
X

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీతో పాటు సాక్షి మీడియా ఏ స్థాయిలో కుట్రలు చేస్తుందో చెప్పే విషయం మరొకటి బయటపడింది. తాజాగా కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద కొన్ని మందు బాటిళ్లు ఉన్నాయని.. తిరుమల పవిత్రత దెబ్బతింటోందని సాక్షి మీడియాలో రకరకాల కథనాలు గత నాలుగు రోజులుగా వస్తున్నాయి. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు. వాస్తవానికి వీటిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీకి సాక్షి మీడియాకు చెందిన వారే. కొండ కింద తిరుపతిలో తాగేసి పక్కన పడేసిన బాటిళ్లు మొత్తం కారులో తీసుకొచ్చి ఆ పోలీస్ గెస్ట్ హౌస్ పక్కన గోడ దగ్గర పాడేశారు. ఆ మద్యం బాటిళ్లపై ఉన్న వివరాల ఆధారంగా ఆ బాటిళ్లు ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారనే విషయాలను పోలీసులు కనిపెట్టారు.

అలిపిరి టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ వివరాలను బయటకు తీశారు. సీసీ టీవీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. వైసీపీ కార్యకర్త కోటి వీటిని కొన్నాడు. ఈ బాటిళ్లను కొని గెస్ట్ హౌస్ దగ్గర పడేసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కు ఫోన్ చేశారు. నవీన్ మోహనకృష్ణకు చేశాడు. సాక్షి ఫొటో గ్రాఫర్ మోహనకృష్ణకు సాక్షి స్టాఫ్‌ రిపోర్టర్ ప్రసాద్ కు ఫోన్ చేశాడు. వీరంతా కలిసి ఫొటోలు, వీడియోలు తీసి తప్పుడు వార్తలు రాసి పబ్లిష్ చేశారు.

చివరకు పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు. వారే పడేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేశారని బట్టబయలు చేశారు. దీంతో సాక్షి మీడియాపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండ పవిత్రతను దెబ్బతీయడానికి ఒక మీడియా సంస్థ ఇంత కుట్ర చేయాలా అని విస్తుపోతున్నారు. మీడియా అంటే జనాలకు నిజాలను చెప్పాలి, ప్రజల తరఫున పోరాడాలి గానీ.. ఇలాంటి పనులు చేయడమేంటని మండిపడుతున్నారు.

Tags

Next Story