టీడీపీ ఆందోళనలతో దిగివచ్చిన పోలీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో చర్చల అనంతరం 161 సెక్షన్ ప్రకారం సుబ్బయ్య భార్య అపరాజిత స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి అంగీకరించారు.

టీడీపీ ఆందోళనలతో పోలీసులు దిగివచ్చారు.. సుబ్బయ్య హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితోపాటు ఆయన బావమరిది బంగారు రెడ్డి పేర్లను కేసులో చేర్చారు పోలీసులు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో చర్చల అనంతరం 161 సెక్షన్ ప్రకారం సుబ్బయ్య భార్య అపరాజిత స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి అంగీకరించారు. అపరాజిత స్టేట్‌మెంట్‌ను కోర్టుకు సమర్పించనున్నారు.. 15 రోజుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.. దీంతో టీడీపీ నేతలు ఆందోళన విరమించారు.
Next Story