Kurnool: కర్నూలులో వింత ఘటన.. కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు..

Kurnool: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పోలీస్ స్టేషన్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ పాముకాటుకు గురవడం, అమ్మాయిల అదృశ్యం సహా స్టేషన్‌కు ఎక్కువగా పొలిటికల్ కేసులు వస్తున్నాయని శాంతి పూజలు నిర్వహంచారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్చకులు ఎస్సైల సమక్షంలో స్టేషన్ అంతా గో మూత్రం చల్లించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిరోజులుగా కేసులు పెరిగాయి. అందులో పోలీసులకు ఇబ్బందిగా మారే కేసులు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దీంతో పాటు ఇటీవల ఓ కానిస్టేబుల్ పాము కాటు వేయడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇవన్ని గమనించిన కొందరు శాంతి పూజ చేస్తే సమస్యలు తొలగిపోతాయని చెప్పడంతో.. పోలీసులు దోష నివారణ కోసం ఇలా చేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com