15 April 2022 3:32 PM GMT

NTR District: హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి వెళ్తున్న బస్సులో రూ.కోటి 80 లక్షల నగదు..

NTR District: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌ పోస్టు దగ్గర వాహన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది.

NTR District: హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి వెళ్తున్న బస్సులో రూ.కోటి 80 లక్షల నగదు..
X

NTR District: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌ పోస్టు దగ్గర వాహన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది.. ఓ బస్సును ఆపి తనిఖీ చేసిన పోలీసులకు.. కోటి 90 లక్షల నగదు పట్టుబడింది.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఈ డబ్బును తరలిస్తున్నారు.. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు డబ్బును సీజ్‌ చేశారు..

కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇటీవల చెక్‌ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోంది.. కొద్దిరోజుల క్రితం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ దాదాపు పది కోట్ల రూపాయల డబ్బు పట్టుబడింది. తాజాగా జరిపిన తనిఖీల్లో కోటి 90 లక్షల పట్టుబడటం చర్చనీయాంశం అవుతోంది.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story