బొత్స ఫ్యామిలీలో పొలిటికల్ వార్

బొత్స ఫ్యామిలీలో పొలిటికల్ వార్
నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొత్సా సోదరులపై ఫైర్ అయ్యారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొత్సా సోదరులపై ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో బొత్సా లక్ష్మణరావు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే అప్పలనాయుడు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మండిపడ్డారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు చెప్పినా ఆయన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ బ్రోకర్లను పోటీగా పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్స్ వేయిస్తున్నారని అప్పలనాయుడు ఆరోపించారు. డబ్బులు వెదజల్లుతూ ఏకగ్రీవాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.


Tags

Next Story