Posani Krishna : అలీ బాటలో పోసాని.. రాజకీయాలకు గుడ్ బై

Posani Krishna : అలీ బాటలో పోసాని.. రాజకీయాలకు గుడ్ బై
X

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను, ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తనను ఎవరూ ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడబోనని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పోసాని పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే అలీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియా పోస్టులపై కేసులు, అరెస్టుల పరిణామాలతో పోసాని వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

Tags

Next Story