AP : ఏపీకి పెట్టుబడులు.. సీఎం టూర్‌పై పాజిటివ్ రెస్పాన్స్

AP : ఏపీకి పెట్టుబడులు.. సీఎం టూర్‌పై పాజిటివ్ రెస్పాన్స్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన సత్ఫలితాలను ఇస్తోంది. దక్షిణ కోస్తా రైల్వేజోనుకు శంకుస్థాపనపై చర్చించడం కీలక పరిణామం. గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన సమయంలో పోలవరం, అమరావతి నిర్మా ణాలకు నిధులపై సానుకూల స్పందన వచ్చింది. గతంలో కేంద్ర కేబినెట్ మీటింగ్లో పోలవరం అంశాన్ని పెట్టి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మంగళవారం పోలవరానికి రూ.2,800 కోట్లను కేంద్ర విడుదల చేసింది. రీయింబర్స్మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశల వారీగా డబ్బు చెల్లించేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో చంద్రబాబు పలుకుబడి కారణంగానే ఇది సాధ్యమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Tags

Next Story