Potti Sriramulu Statue : పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దంటున్న వైసిపి.. ఇదేం దారుణం.

ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడం అంటే ఆంధ్రుల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడమే అవుతుంది. ఆంధ్రుల కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక గొప్ప మహనీయుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్క ఆంధ్రుడి బాధ్యత. అలాంటి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాన్ని ఒక టూరిస్ట్ హబ్ గా కూడా ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీకి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఒక ఐకానిక్ గా ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇలా కూటమి ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలుగా గుర్తింపు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ వైసీపీ మాత్రం ప్రతిదానికి అడ్డం పడుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఏపీకి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడానికి చాలా కుట్రలు చేస్తున్న వైసిపి.. ఇప్పుడు ఏకంగా పొట్టి శ్రీరాములు విగ్రహం పై కూడా రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తుంది.
కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును వేస్ట్ చేస్తోందని.. అనవసరంగా డబ్బులు మొత్తం ఖర్చు పెడుతున్నారు అంటూ ఇలా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తోంది వైసిపి. జగన్ ఆదేశాలతో చాలామంది వైసిపి నేతలు పనిగట్టుకుని మరీ పొట్టి శ్రీరాములు విగ్రహంపై ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏపీకి ఒక ఉనికి ఉండాలని.. ఆంధ్రుల హక్కుల కోసం ప్రాణాలు విడిచిన గొప్ప వ్యక్తిని స్మరించుకోవాలనే మంచి ఉద్దేశంతో విగ్రహం కడితే.. దాన్ని కూడా తప్పుపట్టడం మహాదారుణం అంటున్నారు సామాన్య జనాలు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసమే తప్ప.. కట్టడాలు, పెట్టుబడులు, నిర్మాణాలు అనే మాటే లేదు.
కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులతో పాటు ఏపీకి ఒక ఉనికిని చాటడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే ఇలా ప్రతిచోట అడ్డుకుంటుంది వైసిపి పార్టీ. వైసిపి పార్టీ చేస్తున్న పనిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏపీకి ఏ ఒక్కరోజు కూడా ఉపయోగపడే పని చేయని వైసిపి.. అడ్డుకోవడానికి మాత్రం ఇంతగా ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ఉనికి మీద దెబ్బ కొట్టాలని వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఇలాంటి పనులతో ప్రజల్లో మెప్పు పొందలేరని.. అనవసరంగా ఇలాంటి పనులు చేసి వైసిపి అభాసుపాలు కావద్దని చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
