డేంజర్‌లో ప్రకాశం బ్యారేజీ.. దెబ్బతిన్న గేటు భారీ వరదను తట్టుకుంటుందా?

X
By - Manikanta |2 Sept 2024 6:00 PM IST
ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడింది. ఎగువ నుంచి దాదాపు 11లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో బ్యారేజీలోని ఓ గేటు దెబ్బతింది. ఇసుక బోటు కొట్టుకు వచ్చి 3, 4వ గేటుకు బలంగా తాకడంతో పిల్లర్ పాక్షికంగా ధ్వంసమైంది.
గేట్ల వద్ద కూడా బోట్లు అడ్డుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 3,4 వ గేటు తప్ప మిగతా గేట్ల నుంచి వరద సాఫీగా కిందకు వెళ్తోందని సమాచారం. ప్రకాశం బ్యారేజీ దిగువన రిటైనింగ్ వాల్ పైవరకు వరద నీరు వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com