వీడిన రాధ మర్డర్‌ మిస్టరీ..భర్తే హంతకుడు

వీడిన రాధ మర్డర్‌ మిస్టరీ..భర్తే హంతకుడు
ప్రకాశం మిస్టరీ మర్డర్‌ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగాయి. రాధ హత్య కేసు కొలిక్కి వచ్చింది

ప్రకాశం మిస్టరీ మర్డర్‌ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగాయి. రాధ హత్య కేసు కొలిక్కి వచ్చింది. తన భార్యను తానే హత్య చేసినట్లు మోహన్‌ రెడ్డి పోలీసుల విచారణలోఅంగీకరించాడు. మరోవైపు సెల్‌ఫోన్‌తో తన భార్యను బురిడీ కొట్టించబోయి తానే బోల్తా పడ్డాడు. 15 రోజులుగా సెల్‌ ఫోన్‌ లో మేసేజ్‌లతో మోహన్‌రెడ్డి ఆడిన నాటకం బయటపడింది.

తన స్నేహితుడు కాశిరెడ్డికి భారీ మొత్తంలో అప్పు ఇప్పించిన రాధ.. తిరిగి వసూలు చేయలేకపోయింది. దీంతో వారి కుటుంబంలో విబేధాలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే ఎలాగైనా భార్యను చంపాలని మోహన్‌రెడ్డి అనుకున్నాడు. అయితే సమయం కోసం ఎదురుచూశాడు. ఈ నేపధ్యంలో 15 రోజులుగా సెల్‌ ఫోన్‌లో మేసేజ్‌లతో కొత్త నాటకానికి తెరలేపాడు. స్వగ్రామంలో జరిగే చౌడేశ్వరీ తిరునాళ్లకు రాధ పుట్టింటికి వచ్చింది. ఇదే అవకాశంగా మార్చిన మోహన్‌రెడ్డి.. రాధ ఫ్రెండ్‌ కాశిరెడ్డి పేరుతో సిమ్‌ కార్డులు కొన్నాడు. అతని పేరుతోనే భార్య సెల్‌కు మేసేజ్‌లు చేస్తూ చాటింగ్‌ చేశాడు. కానీ ఈ విషయాన్ని రాధ గుర్తించలేకపోయింది.

మరోవైపు వేర్వేరు ప్రాంతాలు..ఇతరుల ఫోన్ల నుంచి పదిహేను రోజులుగా వివిధ సిమ్‌కార్డులతో తన భార్య రాధతో చాటింగ్‌ చేసినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. హత్య జరిగిన రోజు కొన్ని గంటల ముందు కూడా సూర్యాపేట నుంచి మేసేజ్‌లు పంపిచాడు. చెరకుబండి నిర్వాహకుడి దగ్గర ఫోన్‌ నుంచి కూడా కాశిరెడ్డి పేరుతో చాటింగ్‌ చేశాడు మోహన్‌ రెడ్డి. మరోవైపు కనిగిరిలో ఓ యువతి ఫోన్‌ నుంచి తాను కనిగిరి వచ్చానని కాశిరెడ్డి పేరుతో మరో మేసేజ్‌ పంపాడు. నిజంగా కాశిరెడ్డి వచ్చాడని నమ్మిన రాధ..డబ్బు ఇస్తాడని నమ్మి కనిగిరి వెళ్లింది.. ఆ నమ్మకమే ఆమె చావుకు కారణమైంది.

అటు కాశిరెడ్డి తమ కుమార్తెను హత్య చేశాడని రాధ తల్లిదండ్రులు మొదట ఫిర్యాదు చేశారు. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణ సాగుతుండగా రాధ భర్త మోహన్‌ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఏమీ తెలియనట్లు వ్యవహరించాడు. తన భార్యను కాశిరెడ్డే హత్య చేశాడంటూ పోలీసులను కూడా నమ్మించాడు. అయితే మోహన్‌ రెడ్డి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతని కదలికలపై నిఘా పెట్టారు. హత్య జరిగిన సమయంలో మోహన్‌రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్టు పోలీసులు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించారు. అయితే తాను ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నట్టు నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టడంతో నేరం అంగీకరించాడు మోహన్‌ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story