AP High Court : జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు ముందస్తు బెయిల్

ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట కలిగించింది. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతురావు, CI సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వారు తెలిపారు.
జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com