President Vizag Tour: నేడు విశాఖ సాగరతీరంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

President Vizag Tour: విశాఖ సాగర తీరం... భారీ నౌకాదళ విన్యాసాలకు సిద్ధమయ్యింది. ఇవాళ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నేవి, కోస్ట్‌గార్డ్, ఎన్‌ఐఓటి, సబ్ మెరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నాలుగు వరుసల్లో ప్రదర్శించనున్నారు. అలాగే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 4 వరకు మిలాన్-2022 విన్యాసాలు జరగనున్నాయి. 27న బీచ్ రోడ్డులోని ఇంటర్నేషనల్ పరేడ్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖకు చేరుకున్నాయి. నిన్న మధ్యాహ్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు సీఎం జగన్, ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ స్వాగతం పలికారు. రాత్రి ఈఎన్‌సి ప్రధాన కార్యాలయంలోనే బస చేసిన రామ్‌నాథ్ కోవింద్.. ఇవాళ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా... పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com