Kurnool : కర్నూలు జిల్లా పెద్దాసుపత్రిలో ప్రైవేటు అంబులెన్స్ ల మాఫియా

Kurnool : కర్నూలు జిల్లా పెద్దాసుపత్రిలో ప్రైవేటు అంబులెన్స్ ల మాఫియా
Kurnool : అయితే ఇలాంటి మాఫియా కేవలం తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో దాదాపు ప్రతిచోటా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Kurnool : తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనతో యావత్‌ రాష్ట్రం ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి మాఫియా కేవలం తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో దాదాపు ప్రతిచోటా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కర్నూలు ప్రభుత్వ ధర్మాసుపత్రిలోనూ ఆంబులెన్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఈ ఆసుపత్రి 8 జిల్లాలకు పెద్ద దిక్కు లాంటిది. సీమ జిల్లాలే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకలోని రాయచూర్‌, బళ్లారి, తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల వాసులు కూడా చికిత్స కోసం ఇక్కడికే వస్తారు.

దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ ప్రైవేటు ఆంబులెన్స్‌ల మాఫియా చెలరేగిపోతోంది. అయిన వారిని కోల్పోయి.. గుండె బరువెక్కి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆంబులెన్స్‌ ల నిర్వాహకులు జలగల్లా పీడిస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చేందుకు వేలకు వేలు దండుకుంటున్నారు. నిజానికి కర్నూలు ఆస్పత్రిలో 5 మహా ప్రస్థానం వాహనాలున్నాయి. కానీ వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు.

దీంతో ఆస్పత్రిలో దాదాపు 40 ప్రైవేటు ఆంబులెన్స్‌ లదే ఇష్టారాజ్యం నడుస్తోంది. హాస్పిటల్‌లోని కొంతమంది స్టాఫ్‌ నర్సులు, నర్సులు, సిబ్బందే తమ బంధువుల పేర్లతో వాహనాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

Tags

Read MoreRead Less
Next Story