TG : నల్గొండలో అర్ధరాత్రి పాల్వాయి కొడుకు నిరసన

TG : నల్గొండలో అర్ధరాత్రి పాల్వాయి కొడుకు నిరసన
X

నల్గొండ జిల్లాలో రాత్రి ఉద్రిక్తత తలెత్తింది. చండూర్ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమారుడు శ్రవణ్ రెడ్డి తన భార్యతో కలిసి ధర్నాకు దిగారు. శ్రవణ్ రెడ్డి పాపను తన చెల్లి పాల్వాయి స్రవంతి రెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ 11న పాపను కిడ్నాప్ చేసారంటూ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ పాప ను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కాగా పాప చైల్డ్ వెల్ఫేర్ సంరక్షణలో ఉందని పోలీసులు చెప్పి, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా పాప ను ఎవరు కిడ్నాప్ చేసారో తేల్చాలని గట్టిగా కోరారు.

Tags

Next Story