ప్రజా సమస్యల మీద జగన్ పై విమర్శల వాన

భవిష్యత్ అంధకారమైనప్పుడు యువత నిర్వీర్యం అయిపోతుంది. యువ శక్తి పక్కదారి పడుతుంది. సరైన దారిలో యువతరాన్ని నడిపించకపోతే.. మొత్తం అరాచకం రాజ్యమేలుతుంది. ప్రపంచంలో అనేక దేశాలు.. ప్రాంతాలు చూసిన సత్యం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఉపాధి అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయి.ఇప్పుడు ఏపీ ప్రజలకు ఓ హోప్ కావాలి. ఓ భరోసా కావాలి. ఓ ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే టీడీపీ యువ నాయకుడు రానా లోకేష్ నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ పాదయాత్రక చేస్తున్నారు.కేవలం నడవడం కాదు..సమస్యలపై లోతుగా అధ్యయనం చేయబోతున్నారు.సమస్యల గురించి.. వాటి పరిష్కారం నుంచి వెతుకుతున్నారు.
రాయలసీమలో ముఖ్యంగా ఏపీ సీఎం స్వంత ఇలాక కడపలో యువనేత లోకేష్ పాదయాత్ర ఓ సంచలనం.లోకేష్ తన పాదయాత్రలో అడుగడుగునా ఆయా ప్రాంతాల కష్టాలను ఆకలింపు చేసుకుంటున్నాడు. తను వేసే ప్రతి అడుగులోను స్థానిక పరిస్థితుల స్వరూపాన్ని ఇట్టే పసిగట్టేస్తున్నాడు.ఈ నెల 7న కడపలో రాయలసీమ అభివృద్ది ప్రణాళిక విడుదల చేశాడు.పాదయాత్రలో స్వయంగా ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన ఆయన సాగు నీరు లేక సాయం అందక రైతన్న పడుతున్న ఇబ్బందులు నేరుగా తెలుసుకున్నారు.ఉపాధి లేక వలసలు పోతున్న కూలీల కన్నీరు,ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న యువత సమస్యలపై పూర్తి అవగాహనకు వచ్చిన లోకేష్.వారి సమస్యలకు పరిష్కారం వెదికే దిశగా అడుగులు వేస్తున్నారు.
మరోవైపు పాదయాత్ర అనుసంధానం చేసే ప్రతి చౌరస్తాలో తనను కలిసే ప్రజల కష్టాలను ఓపిగ్గా వింటూ ప్రాంతాల వారీగా ప్రజల మద్దతును చూరగొంటున్నాడు.స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులను దగ్గరగా గమనిస్తున్న లోకేష్ తన ప్రసంగంలో ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా నేరుగా జగన్ పై విమర్శల వాన కురిపిస్తున్నాడు.ఈ నేపథ్యమే ప్రజలను తీవ్రంగా ఆకట్టుకుంటుంది. కడప జిల్లాలో లోకేష్ పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు భవిష్యత్తు పై నమ్మకం కల్సించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com