Puttaparthi: టీడీపీ-వైసీపీ నాయకులపై కేసులు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం వద్ద టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 30 యాక్ట్ ఉల్లంఘించారంటూ రెండు పార్టీల నేతలపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 10 మంది అనుచరులపై.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 10 మంది అనుచరులపై..
ఐపీసీ 147, 148, 149, 188, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసు వాహనంపై దాడి ఘటనలో పల్లె రఘునాథరెడ్డితో సహా మరో పది మంది టీడీపీ నేతలపై 143, 188, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శాంతిభద్రలకు విఘాతం కల్గిస్తే ఎవరినీ ఉపేక్షించమని ఎస్పీ యశ్వంత్ అన్నారు.
ఐతే.. టీడీపీ కార్యాలయం ముందు తన కాన్వాయ్‌తో సత్యమ్మ గుడివైపు కవ్వింపు చర్యలకు పాల్పడిన ఎమ్మెల్యేపై.. తీవ్రమైన కేసులు నమోదు చేయకుండా పోలీసులు పక్షపాతం చూపించారనే విమర్శలు వస్తున్నాయి. పుట్టపర్తిలో బంతి భోజనాలలో అందరికీ వడ్డించినట్లు ఒకే రకమైన కేసులు పెట్టడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఘర్షణలకు ప్రేరేపించినవారిపై తీవ్రమైన సెక్షన్లు పెట్టి.. భవిష్యత్‌లో ఇలాంటి ఘనటలు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com