MLA Sindhoora : టీచర్ గా మారిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర

ఎమ్మెల్యే పల్లె సింధూర ఉపాధ్యాయినిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం వణుకువారిపల్లి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సింధూర ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధించారు. పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం వసతి సౌకర్యాలు గురించి ఆరా తీశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే స్వయంగా పాఠాలు చెప్పడంతో విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. మొక్కలను సంరక్షించుకోవాలని మొక్కల పెంపకం తోనే మానవ మనుగడ సాధ్యమని మొక్కలు ప్రాణవాయువును ఏ విధంగా మనకు అందిస్తాయో పాఠాలు బోధించి పలు అంశాలకు సంబంధించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి నుంచి ఎమ్మెల్యే సమాధానాలు రాబట్టారు. విద్య తోనే మనిషికి సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com