Puttaparthi: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య.. రైలు కింద పడి..

Puttaparthi: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరం ఊటుకూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై.. తెల్లవారుజామున రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు.. పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు మునికుమార్ మృతదేహాన్ని తరలించారు. డిప్యుటేషన్‌పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా మూడు నెలల క్రితమే విధుల్లో చేరారు మునికుమార్.
తక్కువ కాలంలోనే మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితోనూ, సామాన్యులతోనూ బాగా కలిసిపోయారు. మూడు రోజలు క్రితం సెలవుపై కడపకు వెళ్లిన మునికుమార్.. నిన్న సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. మునికుమార్ తల్లి అనారోగ్యం కారణంగా.. కొన్నాళ్లుగా ఆయన మనోవేదనకు గురవుతున్నట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com