Liquor Cost : ఏపీలో రూ. 99కే క్వాలిటీ మద్యం.. మొత్తం 3,736 ప్రైవేట్ దుకాణాలు

కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబా టులోకి తేనుంది. నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబరు మొదటి వారం నుంచి ఈ నూతన పాలసీ అమలు కానుంది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది.
మద్యం ఆదాయ సామర్ధ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% అంటే 340 దుకాణాలను కేటాయించనున్నారు.
తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మద్యాలను అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com