YS Jagan : అధికారం ఉంటే సెట్టింగులు.. నేడు జగన్ ఎక్కడ..?

YS Jagan : అధికారం ఉంటే సెట్టింగులు.. నేడు జగన్ ఎక్కడ..?
X

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా ఎక్కడ అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి నాడు జగన్ ఎందుకు బయటకు రావట్లేదంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి పండుగకు ఐదు కోట్లు ఖర్చు చేసి సెట్లు వేయించుకున్నారు. అలాంటి సెట్లతో పండుగలు జరుపుకున్న చరిత్ర జగన్ కు ఉంది. ఏ పండుగ అయినా సరే ఏ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అయినా సరే అవసరం అనుకుంటే ఆ ఆలయాల సెట్లు వేయించుకొని తాడేపల్లి ప్యాలెస్ లోనే ఆర్టిఫిషియల్ పూజలు చేసిన ఘనత జగన్ కు మాత్రమే దక్కింది. కానీ ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఏపీని వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం బెంగళూరు ప్యాలస్ లో ఉంటూ అక్కడే గడుపుతున్నాడు జగన్. మొన్న దీపావళి నాడు ఆర్టిఫిషియల్ గా నాలుగు కాకర పుల్లలు వెలిగించి కొన్ని ఫోటోలు వదిలాడు జగన్.

ఇప్పుడు సంక్రాంతికి అయితే కనీసం ఒక్క ఫోటో కూడా వదల్లేదు. ఇంత పెద్ద పండుగనాడు కూడా ఏపీకి రాకుండా బెంగుళూరు ప్యాలెస్ లోనే ఉండిపోయాడు. తనకు ఏదైనా అవసరం అనుకుంటే లేదంటే కూటమి మీద బురద చల్లడానికి ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వెంటనే ఫ్లైట్ వేసుకుని ఏపీలో వాలిపోతున్నాడు. తన పని అయిపోగానే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. దీంతో ప్రజలకు జగన్ మీద కూడా నమ్మకం సన్నగిల్లిపోతుంది. కేవలం జగన్ కు అవసరం ఉంటేనే ఏపీకి వస్తాడు తప్ప ఏపీ ప్రజల పండుగలతో గానీ.. వాళ్ల అవసరాలు రాష్ట్ర అభివృద్ధితో జగన్ కు అసలే సంబంధం ఉండట్లేదని ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడింది. తమ కష్ట నష్టాల్లో అండగా ఉండేది కేవలం సీఎం జగన్ చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అని ప్రజలు గుర్తిస్తున్నారు.

ఏపీ ప్రజల పండుగలతో పాటు వారి అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి గౌరవించేది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ కు తెలుగు వారి పండుగలు అన్నా.. హిందువుల సంప్రదాయాలు అన్నా సరే చులకనగా చూస్తున్నారు అనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఏపీ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న జగన్.. చివరకు పండుగలను కూడా తక్కువ చేసి చూడటం ఏంటని మండిపడుతున్నారు.

Tags

Next Story