Kurnool: ఆదోని మార్కెట్‌లో దూసుకెళ్లిన పత్తి ధర.. క్వింటాలుకు ఎంతంటే..?

Kurnool: ఆదోని మార్కెట్‌లో దూసుకెళ్లిన పత్తి ధర.. క్వింటాలుకు ఎంతంటే..?
X
Kurnool: మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మార్కెట్ యార్డులో పత్తికి రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది.

Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో పత్తి ధర దూసుకెళ్తోంది. మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మార్కెట్ యార్డులో పత్తికి రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. క్వింటాలు పత్తి ధర గరిష్ఠంగా 13వేలకుపైగా పలుకింది. అటు కనిష్ఠంగా 9 వేల 500 నుంచి మధ్యస్థగా 10వేల ఐదు వందల ధర పలికింది. ఇది యార్డు చరిత్రలోనే అత్యధిక రేటు అని అధికారులు చెబుతున్నారు.

పత్తి సీజన్‌ ముగిసినా.. ఉత్పత్తికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం చమటోడ్చి పండించిన పంటకు ఫలితం దక్కుతోందని అంటున్నారు. మార్కెట్‌యార్డులో కమీషన్ ఏజెంట్ల కుమ్మక్కుతో.. గత నాలుగురోజుల్లో పత్తి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకున్నాయి. దీంతో అన్నదాతల్లో కాస్తా ఆందోళన నెలకొన్నా.. ఈనెల 22తోపాటు ఇవాళ మార్కెట్‌లో పత్తికి మళ్లీ రికార్డు ధర పలుకింది.

ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర 12 వేల 9 వందల మేర ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. రికార్డు ధరలతో..ఇకనైనా నష్టాల ఊబిలోనుంచి గట్టెక్కే పరిస్థితులు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ అధికమైంది. ఉక్రెయిన్ యుద్ధపరిస్థితుల ఎఫెక్ట్‌ సైతం ధరపై కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి దూది కండి ధర పెరగటంతో.. పత్తికి గిరాకి అధికమైంది. అటు వంటనూనె కొరతతో పత్తిగింజలకు డిమాండ్ నెలకొంది. పత్తిగింజల ధర గతంలో 84 వేల రూపాయలు పలుకగా..ప్రస్తుతం 90వేలకు చేరింది. అటు విదేశాల దూది గింజలకు సైతం అధిక ధర లభిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story