28 Feb 2021 11:00 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / వైసీపీ ప్రభుత్వ తీరుపై...

వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విమర్శలు

వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఈ ప్రభుత్వంలో భజనపరులు పెరిగిపోయారంటూ ఎద్దేవా చేశారు..

వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విమర్శలు
X

వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఈ ప్రభుత్వంలో భజనపరులు పెరిగిపోయారంటూ ఎద్దేవా చేశారు.. నిజాలు తెలిసినా మాట్లాడే పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు లేరన్నారు. చివరకు ప్రజలు కూడా నిజం చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాలు, తలా తోకా లేని పోలీసు వ్యవస్థ వస్తాయనే రాజ్యాంగంలో ఎంపీలకు భద్రత కల్పించారని ఎంపీ రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అనుసరించి ఎంపీ తీసుకునే నిర్ణయంపై కేసులు పెట్టడానికి లేదని అన్నారు. చిన్నాన్న చెప్పాడని తనపై కేసులు పెడుతున్నారని పోలీసుల తీరుపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story