Raghuram Krishna Reacts : విజయ్ పాల్ అరెస్ట్ సంతోషం.. రఘురామ రియాక్షన్

సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారనీ.. ఆయన పాపం పండిందని చెప్పారు. ఓ క్రిమినల్ లాగా తనకు ఏమీ తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారనీ..తనను కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారని మండిపడ్డారు. ఈ కుట్రలో పీవీ సునీల్ కుమార్ ఉన్నారనీ.. కీలక నిందితుడిని అరెస్ట్ చేయడం సంతోషమని చెప్పారు రఘురామ. సునీల్ కుమార్,విజయ్ పాల్ అంత ఒక ముఠా అనీ.. అందరూ కలిసి కుట్ర చేశారని అన్నారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని... పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని ఆరోపణలు చేశారు రఘురామ కృష్ణరాజు. పీవీ సునీల్ కుమార్ కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలని.. ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని అన్నారు. దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసుల పై ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com