ఉద్యమమే లేకపోతే అసెంబ్లీకి వెళ్ళేందుకు మీకు సెక్యూరిటీ ఎందుకు? :రఘురామకృష్ణరాజు

ఏపీలో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం ధరిత్రి ఎరుగని చరిత్ర అన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. న్యాయముర్తులకు ఉద్దేశాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా దాడులు ఆగడం లేదన్నారు. సోషల్ మీడియా దుషణాలపై 6 నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేని చేతకాని, నిస్సహాయ స్థితిలో సిఐడి ఉందన్నారు.
300 రోజులుగా అమరావతి రైతులు నిరసన తెలుపుతుంటే సానుభూతి లేకపోగా ప్రభుత్వం అవమానిస్తోందన్నారు రఘురామకృష్ణరాజు. ఉద్యమమే లేకపోతే అసెంబ్లీ కి వెళ్ళడానికి ఎందుకు సెక్యూరిటీ పెట్టుకుంటున్నారని సీఎం జగన్‌ను ప్రశ్నించారాయన. ఉద్యమకారులంటే భయంతోనే సచివాలయానికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. సజ్జల వంటి సలహాదారుల వల్ల మీరు ప్రజలకు దూరం అవుతున్నారన్నారు రఘురామకృష్ణరాజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com