EWS రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదు..సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

EWS రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదు..సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ
Raghurama:ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

Raghurama: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా చేసిన నియామకాలలో ఆర్ధికంగా వెనుకబడిన నిరుద్యోగ యువకులు.. తమకు వాటాగా రావాల్సిన ఉద్యోగాలను కోల్పోయారని సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఏపీలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థలలో మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అంశంలోనూ EWS రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదని.. తక్షణమే ఉద్యోగాలలో EWS రిజర్వేషన్లను అమలు చేయాలి కోరారు.

భవిష్యత్తులో జరిగే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలన్నారు రఘురామకృష్ణరాజు. విద్యాసంస్థల్లో EWS రిజర్వేషన్లు అమలు చేస్తూ, ఉద్యోగాలలో మాత్రం నిలుపుదల చేశారని చెప్పారు. ఈ అంశంలో అవసరమైన సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే కాపు కులస్తులకు ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. మిగిలిన 5 శాతం ఆర్ధికంగా బలహీనంగా ఉన్న ఇతర అగ్ర కులాలకు ఉంటుందన్నారు.

అత్యధిక జనాభా ఉన్న కాపు కులస్తులలో సామాజిక, ఆర్ధిక వెనుకబాటుతనం ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తుందని.. చాలా ఏళ్లుగా వారు ఈ రిజర్వేషన్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. కాపు కులస్తులలో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక మానసిక వేదన అనుభవిస్తున్నారుని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు కులస్తులకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు రాదన్నారు రఘురామ. అత్యంత కీలకమైన ఈ అంశంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లేఖలో ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story