ఏపీలో సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి : రఘురామ కృష్ణంరాజు

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఏపీలో సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. స్వరూపానంద స్వామి పుట్టిన రోజున ప్రత్యేక మర్యాదలపై దేవాదాయ శాఖ ఇచ్చిన మెమోపై ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడం, అప్పన్న భూములను, మాన్సాస్ భూముల వివాదం విషయంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి విషయంలో వేలు పెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం పాస్టర్లకు వేతనం ప్రకటించడంతో చాలామంది మతం మార్చుకుని పాస్టర్లుగా మారారని వీరంతా 60 శాతంపైగా హిందువులేనని ఒ సర్వేలో తేలిందన్నారు. ప్రభుత్వం మత మార్పిడిలను ప్రొత్సహించేలా వ్యవహరిస్తోందని రఘురామకృష్ణంరాజు దుయ్యబట్టారు. ప్రతి పథకానికి జగన్న పేరును జోడించి రోజు పేపర్లలో ప్రకటనలు ఇస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. రఘరామరాజు మీడియా సమావేశాలకు హాజరై.. ప్రచురించిన.. ప్రసారం చేసిన మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడాన్ని ఖండించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com