ఢిల్లీ వెళ్లినప్పుడల్లా సీఎం జగన్ ప్రధాని మోదీ ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి : రఘురామకృష్ణరాజు

ఢిల్లీ వెళ్లినప్పుడల్లా సీఎం జగన్ ప్రధాని మోదీ ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి : రఘురామకృష్ణరాజు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సొంత పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వేళ ఏపీలో ఉక్కు ఉద్యమం ఉధృతమైంది. ప్రతిపక్ష పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు కేంద్రం, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం చేయడంపై ఏపీ భగ్గుమంటుండగా.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సొంత పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ప్రశ్నలవర్షం సంధించారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా సీఎం జగన్ ప్రధాని మోదీ ఏం మాట్లాడుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణే కాకుండా పోలవరం, ప్రత్యేక హోదా అంశాల సంగతేంటని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టుని మైనర్ పోర్టుకు ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. ప్రజలకు సీఎం జగన్ జవాబుదారీగా ఉండాలన్న రఘురామకృష్ణరాజు.. ప్రజలు ఓటు వేస్తేనే సీఎం అయ్యారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.


Tags

Read MoreRead Less
Next Story