AP Rains: విటలరాయుని చెరువు తెగిపోతుందని వదంతులు.. భయాందోళనలో ప్రజలు..

AP Rains (tv5news.in)
AP Rains: అనంతపురం జిల్లా కదిరిలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు పొంగాయి. కదిరి సమీపంలోని విటలరాయుని చెరువు ఒక్కసారిగా ఉప్పొంగడంతో పట్టణంలోని 42వ జాతీయ రహదారిపైకి భారీగా వరద వచ్చింది. కదిరి - రాయచోటి, కదిరి - హిందూపురం మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థులు పడుతున్నారు.
విటలరాయుని చెరువు తెగిపోతుందని వదంతులు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు ప్రమాదం ఏమీ లేదనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అటు.. వందలాది ఎకరాల్లో వరి నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మద్దిలేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. కదిరి లోతట్టు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కందికుంట ప్రసాద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com