Vijayawada : వేగంగా బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు

Vijayawada : వేగంగా బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు

విజయవాడ ముంపునకు కారణం కృష్ణా నది కాదని, బుడమేరు వరదతోనే విపత్తు ఎదురైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత విపత్తు ఎదురైందని, ఇలాంటి ఆపద స మయంలో బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూనే మరోవైపు అడ్డంకులు సృష్టిస్తున్న రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

తన జీవితంలో ఎన్నడూ చూడని విపత్తు ఇదని, 7 లక్షల మందికి సాయం అందించాల్సిన పరిస్థితి నెలకొనడంతోపాటు అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులంతా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

వేగంగా బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు జరుగుతున్నాయని.. గండ్లు పూడ్చే బాధ్యత మంత్రులు లోకేష్, నిమ్మలకు అప్పగించామన్నారు చంద్రబాబు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెంచితే జైలుకు పంపిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందుతున్నాయన్నారు. యుద్ధంలా పనిచేస్తుంటే రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష వైసీపీపై ఫైరయ్యారు. రాజకీయ ముసుగులోని నేరస్తులను సంఘ బహిష్కరణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Tags

Next Story