ఇళ్ల పట్టాల పంపిణీలో రసాభాస.. టీడీపీ ఎమ్మెల్యేను మాట్లాడనివ్వని వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షం ప్రతిపక్ష నేతలపై ఎలాంటి వైఖరి చూపిస్తుందో తెలిపే ఘటన తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జరిగింది.మండపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో జరిగిన ఇళ్లపట్టాల పంపిణీ రసాభాసగా మారింది. వైసీపీ నేత తోట త్రిమూర్తులు మాట్లాడిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు మాట్లాడేందుకు యత్నించారు.
అయితే ఆయన్ను వైసీపీ నాయకుడు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో ఆయన స్టేజి పైన కూర్చొనే నిరసన తెలిపారు. అయితే వైసీపీ నేతల తీరు మారలేదు. ఆ తర్వాత మాట్లాడదామని ప్రయత్నిస్తే ఏకంగా మైకు కట్ చేశారు. ఇక ఇదే సభలో మాట్లాడిన వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గత సర్కారు హయాంలో పోలీసులు కుక్కల్లా వ్యవహరించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అక్కడే ఉన్న రూరల్ సీఐ మంగదేవి... కర్రి పాపారాయుడు వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఒకరు చేసిన పొరపాటుకు పోలీస్ వ్యవస్థనే అనడం సరికాదని చెప్పారు...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com