ఏపీలో దుర్వినియోగం అవుతున్న రేషన్ పంపిణీ వాహనాలు..!
X
By - TV5 Digital Team |1 April 2021 9:25 AM IST
రేషన్ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు దుర్వినియోగమవుతున్నాయి. ఓ వైపు ఇంటింటికీ వచ్చి రేషన్ ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి.
రేషన్ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు దుర్వినియోగమవుతున్నాయి. ఓ వైపు ఇంటింటికీ వచ్చి రేషన్ ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏకంగా ఓ వాహనం టైర్లను ఎత్తుకెళ్లారు దొంగలు. విశాఖ జిల్లా పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటింటికీ రేషన్ తమ వల్ల కాదంటూ ఓ వాహనాన్ని నిర్వాహకుడు ప్రభుత్వానికి తిరిగి అప్పగించాడు. దీంతో ఆ వాహనం తహసీల్దార్ కార్యాలయంలో ఉంచారు అధికారులు. అయితే.. ఆ వాహనం నాలుగు చక్రాలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com