ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు

ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు
ఇంటి వద్దకే రేషన్ అని చెప్పి.. వీధి చివర వాహనం పెట్టి అక్కడికే వచ్చి రేషన్ తీసుకోమనడంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు.

వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బియ్యం బస్తాలు మోయలేమంటూ రేషన్ వాహన డ్రైవర్లు తెగేసి చెబుతున్నారు.

రేషన్ పంపిణీ వాహనాలకు హమాలీలను పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏలూరు ఎమ్మార్వోకు మొరపెట్టుకున్నారు. అధికారులు డ్రైవర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. జిల్లాల్లో అక్కడక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

ఇంటి వద్దకే రేషన్ అని చెప్పి.. వీధి చివర వాహనం పెట్టి అక్కడికే వచ్చి రేషన్ తీసుకోమనడంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రచార ఆర్భాటాలు తప్ప పథకం సరిగా అమలవుతుందో లేదో కూడా పట్టించుకోవడం లేదని జనం విమర్శిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story