Tirupati Floods: రాయల చెరువు కట్ట 99శాతం తేగే అవకాశం లేదు: ఇరిగేషన్ శాఖ

Rayala Cheruvu (tv5news.in)
Tirupati Floods: తిరుపతి రామచంద్రపురంలోని రాయల చెరువు కట్ట 99శాతం తేగే అవకాశం లేదన్నారు ఇరిగేషన్ అధికారి శివారెడ్డి. అయినప్పటికీ ప్రజలంతా ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చెరువులో నీరు ప్రమాద స్థాయిని దాటింది. ఒకపక్క చిన్న గండి పడింది. మెషిన్లతో ఇరిగేషన్ అధికారులు చెరువులోని నీటిని తోడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ హరినారాయణ, ఎస్పీ వెంకటనాయుడు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
దురదృష్టం కొద్దీ ఒకవేళ చెరువు తెగితే దాదాపు 100 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. రాయల చెరువు నుంచి శ్రీకాళ హస్తివరకు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతో ఈ ప్రాంత ప్రజలంతా పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. చెరువుకు చిన్న గండి పడటంతో.. ధైర్యంగా ఉండాలనే భరోసా ఇవ్వలేకపోతున్నారు ఇరిగేషన్ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com