సీమ అభివృద్దే ధ్యేయం:నారా లోకేష్

సీమ అభివృద్దే ధ్యేయం:నారా లోకేష్
X
ఈ నెల 7న కడపలో రాయలసీమ అభివృద్ది ప్రణాళిక విడుదల చేయనున్నారు లోకేష్

లోకేష్ తన పాదయాత్రలో అడుగడుగునా ఆయా ప్రాంతాల కష్టాలను ఆకలింపు చేసుకుంటున్నాడు. తను వేసే ప్రతి అడుగులోను స్థానిక పరిస్థితుల స్వరూపాన్ని ఇట్టే పసిగట్టేస్తున్నాడు. ఈనేపధ్యంలోనే ఈ నెల 7న కడపలో రాయలసీమ అభివృద్ది ప్రణాళిక విడుదల చేయనున్నారు లోకేష్.రాయలసీమలో జరుగుతున్న పాదయాత్రలో స్వయంగా ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన ఆయన సాగు నీరు లేక సాయం అందక రైతన్న పడుతున్న ఇబ్బందులు నేరుగా తెలుసుకున్నారు.ఉపాధి లేక వలసలు పోతున్న కూలీల కన్నీరు,ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న యువత సమస్యలపై పూర్తి అవగాహనకు వచ్చిన లోకేష్‌ వారి సమస్యలకు పరిష్కారం వెదికే దిశగా అడుగులు వేస్తున్నారు.యువగళం పాదయాత్ర రాయలసీమ దాటేలోపు అభివృద్ది ప్రణాళిక ప్రకటిస్తామని ముందే ప్రకటించిన లోకేష్.. దానిపై కసరత్తు చేసి సీమ రూట్‌ మ్యాప్‌ను ప్రకటించనున్నారు.

మరోవైపు పాదయాత్ర అనుసంధానం చేసే ప్రతి చౌరస్తాలో తనను కలిసే ప్రజల కష్టాలను ఓపిగ్గా వింటూ ప్రాంతాల వారీగా ప్రజల మద్దతును చూర గొంటున్నాడు.స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులను దగ్గరగా గమనిస్తున్న లోకేష్ తన ప్రసంగంలో ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా నేరుగా జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.ఈ నేపథ్యమే ప్రజలను తీవ్రంగా ఆకట్టుకుంటుంది.

Tags

Next Story