Nellore: తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు.. మహిళలతో నగ్నంగా..

Nellore: తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు.. మహిళలతో నగ్నంగా..
Nellore: జాతరంటే భక్తిభావం. జాతరంటే కోలాహలం. జాతరంటే డప్పు చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలు.

Nellore: జాతరంటే భక్తిభావం. జాతరంటే కోలాహలం. జాతరంటే డప్పు చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలు. కానీ.. నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం తొగురువారిపాలెంలో జాతర అర్థమే మారిపోయింది. ఓసారి ఈ దృశ్యాలు చూడండి.. ఏం జరిగిందో మీకే తెలుస్తుంది. పోలేరమ్మ జాతరలో సంప్రదాయాలు పక్కకుపోయాయి.. వికృత చేష్టలు తెరపైకి వచ్చాయి. తిరునాళ్ల మధ్యలో ఓ వేదిక ఏర్పాటు చేసి అక్కడ అశ్లీల నృత్యాలకు తెరతీశారు.

పట్టపగలే అమ్మాయిలతో బట్టలు విప్పించి నగ్నంగా డాన్సులు వేయించారు. చుట్టూ చేరిన యువకులంతా ఆ దృశ్యాలు తమ ఫోన్లలో రికార్డు చేస్తూ కనిపించారు. అత్యంత హేయంగా పట్టపగలే అమ్మాయిల శీలానికి వెలకట్టి మరీ ఈ రికార్డింగ్ డాన్సులు జరిగాయి. ఈ విషయం తెలిసి ఊళ్లో ఆడవాళ్లు ఎవరూ కూడా జాతరకు రాలేకపోయారంటే ఎంత ఘోరాతిఘోరంగా ఈ న్యూడ్‌ షో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ అశ్లీల నృత్యాలు.. భక్తులకు ఇబ్బందిగా మారినా ఆలయ కమిటీ పట్టించుకోలేదు. అత్యంత జుగుప్సాకరంగా సాగుతున్న ఈ డాన్సులపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మహిళలతో బట్టలు విప్పించి దారుణంగా డాన్స్‌లు చేయించిన ఆలయ కమిటీ తీరుపై మండిపడుతున్నారు భక్తులు.

ఈ జాతరకు పొంగళ్లు పెట్టుకునేందుకు వచ్చేవారిలో మహిళలు కూడా ఎక్కువగా ఉండటంతో.. వారంతా ఈ దారుణాలను చూడలేక వెళ్లిపోయారు. కనిగిరి పోలీసులు దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు కొందరు గ్రామస్థులు. వైసీపీ నేతలే ఈ ఇలాంటి షోలకు సపోర్ట్ చేస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అమ్మాయిలతో పూర్తిగా బట్టలు విప్పించి డాన్సులు చేయించిన దృశ్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.

అందుకే వాటిని ప్రసారం చేయకుండా జాతరలో ఎంత అరాచకం జరిగిందో చెప్పేందుకు కొన్ని సీన్లను మాత్రమే బ్లర్ చేసి ప్రసారం చేస్తున్నాం. పోలీసులపై అసలు ఆలయ కమిటీకి కానీ, గ్రామంలో పెద్దలకు కానీ భయం ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా..? పట్టపగలే అశ్లీల నృత్యాలు చేయించేంత పరిస్థితికి కారణం ఎవరు..? దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story