Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం..

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరదల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ నీటినిల్వ ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాల ప్రభావం తగ్గడంతో శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 64,562 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఔట్ ఫ్లో 1,01,131 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,816 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరిందని...పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.40 టీఎంసీల వద్ద నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com