Krishna River Water : శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు కృష్ణా నీళ్లు విడుదల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటివిడుదల కోసంకృష్ణానదీ యాజమాన్యం బోర్డు కీలకనిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో పరస్తుతం ఉన్న 9.914 టీఎంలు తెలంగాణ, ఏపీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ నిర్ణయం. మేరకు ఏపీ 4,500 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వప్రధాన కార్యదర్శులు కష్ణా నది యాజమాన్యంతో జరిగిన సమావేశం అనంతరం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీశైలం నుంచి పవర్ హౌస్ ద్వారా నీరు విడుదల చేయాలని బోర్డు తెలిపింది. బుధవారం నుంచి నీటి విడుదలకు కృష్ణా నది యాజమాన్యం బోర్డు అనుమతించింది. తాగునీటి అవసరాలకే నీటిని వినియోగించాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో క్రమేణ నీటి ఎద్దడి ఏర్పడటంతో ప్రాజెక్టుల్లో వర్షం నీరు నిలిచేంతవరకు తాగునీటి అవసరాలకు నీటిని కేటాయిస్తూ కృష్ణా నది యాజమాన్యం బోర్డు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com