CM Chandrababu : సుప్రీంలో చంద్రబాబుకు ఊరట

CM Chandrababu : సుప్రీంలో చంద్రబాబుకు ఊరట

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ తో పాటు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ కు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.

ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. వారికి బెయిల్ మంజూరు చేయడం సమంజసమే అని వెల్లడించింది. స్కాం జరిగిందన్న ఆధారాలు కూడా చూపించకుండా బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ ఎలా పిటిషన్ వేస్తారని న్యాయమూర్తి ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story