ACB Court : ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ

ACB Court : ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ లో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు కొన్ని ప్రాథమిక వసతులు కల్పిస్తారు. అయితే, మిథున్ రెడ్డికి ఆరోగ్య కారణాలు, లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. టీవీ , వెస్ట్రన్ కమోడ్ రూమ్, బయట నుంచి మూడు పూట్ల భోజనం, మంచం, దోమ తెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తా పత్రికలను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు మిథున్ రెడ్డికి రిమాండ్ సమయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో జారీ అయ్యాయి. సాధారణంగా, జైలులో ఖైదీలకు ఇలాంటి సౌకర్యాలు లభించవు. ప్రత్యేక పరిస్థితులలో, కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే వీటిని అనుమతిస్తారు. కాగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) అరెస్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అవినీతి జరిగిందని, ఆన్లైన్ విధానం స్థానంలో మాన్యువల్ పద్ధతిని తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల్లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ఆయనకు చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 3,200 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఈ స్కామ్ జరిగిందని అంచనా.

Tags

Next Story