RGV : ఆర్జీవీకి హైకోర్టులో ఊరట

RGV : ఆర్జీవీకి హైకోర్టులో ఊరట
X

సినీ ప్రముఖుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై తొందరపాటు చర్యలొద్దంటూ సీఐడిని న్యాయస్థానం ఆదేశించింది. కుల, మత వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చిత్రీకరించారని, వర్మ సినిమా వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయన్న పలువురి ఫిర్యాదుల మేరకు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి తదితర చోట్ల వర్మపై కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో విచారణ హాజరుకావాలంటూ రాంగోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల అనంతరం వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags

Next Story