AP Liquor Case : ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP Liquor Case : ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
X

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ గడువును వచ్చే నెల 9 వరకు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ మంగళవారం నాటితో ముగియడంతో, సిట్ అధికారులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులు వివిధ జైళ్లలో రిమాండ్‌లో ఉన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరో తొమ్మిది మంది నిందితులు విజయవాడ జిల్లా జైలులో, ఇద్దరు గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్నారు.

ఏసీబీ కోర్టు అభ్యంతరాలు

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జిషీట్లలో 21కి పైగా అభ్యంతరాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు. నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందో వివరించాలని.. అలాగే సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోర్టు కోరింది.

Tags

Next Story