ఉద్యమంలా.. ఏపీలో ఓట్ల తొలగింపు

ఉద్యమంలా.. ఏపీలో ఓట్ల తొలగింపు
ఓటర్‌ లిస్ట్ లో ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉందంటూ కొన్ని, వ్యక్తులు చని పోయారంటూ మరికొన్ని, వలస వెళ్లారంటూ ఇంకొన్ని ఓట్లు తీసేశారు. అయితే నిజంగా అలాంటి పరిస్ధితి ఉంటే అదేమి తప్పు కాదు.కానీ విశాఖ తూర్పులో పరిస్థితి విరుద్దంగా ఉంది.

ఏపీలో ఓట్ల తొలగింపు ఓ ఉద్యమంలా సాగుతోంది. మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు ఎక్కువగా ఉండే చోట్ల ఈ తొలగింపు పక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.ఇక టీడీపీకి పట్టున్న విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40 వేల ఓట్ల తొలగించారు. అయితే ఇదంతా జగన్‌ సర్కార్‌ ఆదేశాలతోనే జరుగుతుందని,వాలంటీర్లతో ఓట్ల తొలగించే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు.

ఇక ఓటర్‌ లిస్ట్ లో ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉందంటూ కొన్ని, వ్యక్తులు చని పోయారంటూ మరికొన్ని, వలస వెళ్లారంటూ ఇంకొన్ని ఓట్లు తీసేశారు. అయితే నిజంగా అలాంటి పరిస్ధితి ఉంటే అదేమి తప్పు కాదు.కానీ విశాఖ తూర్పులో పరిస్థితి విరుద్దంగా ఉంది.

టీడీపీ ఓటర్లు, సానుభూతిపరులు, కార్యకర్తలకు సంబంధించిన ఓట్లే తీసేశారు. వైసీపీ నేతల ఆదేశాలతో వాలంటీర్లు ఓట్ల తొలగింపు ప్రక్రియను కొనసాగించారు. విశాఖలోని పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని చాలా కుటుంబాలకు ఓటే లేకుండా పోయింది. మరికొన్నిచోట్ల కుటుంబంలోని ఒకరి ఓటు ఉంచి మిగతావారివి తీసేశారు.జీవీఎంసీ ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్లూ కూడా ఈ ఓటర్ల లిస్ట్ లో లేవు. ఒకే కుటుంబంలోని ఒకరి ఓటు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో, మరొకరిది వేరే కేంద్రం పరిధిలో చేర్చారు.

మరోవైపు ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాల సానుభూతిపరులు ఓటేసే అవకాశమే లేకుండా చేసేందుకు జగన్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.వాలంటీర్లే ఓట్ల తొలగింపుకు మూల కారణంగా కనిపిస్తోంది.ప్రతిపక్షాల ఓట్లు మాత్రమే తొలగిస్తూ వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల సంఘం మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పైకి ఓటరు నమోదు, ఎలాంటి ఎన్నికల విధులనూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఆదేశాలివ్వటమే తప్ప.. గీత దాటుతున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు.

అటు వైసీపీకి అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఈ ఓట్లు తొలగింపు జరుగుతుంటే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టర్‌ ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.అర్హుల ఓట్లను తొలగించిన బూత్‌ స్థాయి అధికారులు, ఇతర బాధ్యులను గుర్తించి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నాయి. సమాచారం ఇవ్వకుండా తమ ఓట్లు ఎలా తొలగిస్తారని మండిపడుతున్నారు విశాఖ ఓటర్లు.

Tags

Read MoreRead Less
Next Story