Kakinada : రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ భూమి కబ్జా

విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి భూమి కబ్జాకు గురైన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లి రామానాయుడు, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. సొంత ఇంటి కోసం కాకినాడలోని గైగోలుపాడులో 700 గజాల స్థలం కొన్నారు. ఇళ్లు నిర్మించేందుకు స్థలం వద్దకు చేరుకోగా అక్కడ షెడ్డు నిర్మించి, గేటు ఏర్పాటు చేసి కొందరు కాపలా ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. ఇదేమిటని అడిగితే కాకినాడకి చెందిన మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన వైసీపీ మాజీ నేత అనుచరులమని, ఈ స్థలం వద్దకు రావద్దంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షామ్మోహన్‌ను, ఎస్ పి బిందు మాధవ్‌ను కలిశారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతోనే కలక్టర్‌కు మొరపెట్టుకున్నామని, లేని పక్షంలోఆత్మహత్యే శరణ్యమన్నారు. అయితే ఇంటిలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com