High Court : ఆర్జీవీకి హైకోర్టులో ఊరట

సోషల్ మీడియా పోస్టుల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట దక్కింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై పూర్తి స్థాయి వాదనల నిమిత్తం విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. అప్పటి వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యూహం సినిమా విడుదల సందర్భంగా గత ఏడాది అక్టోబర్ లో రాంగోపాల్ వర్మ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేషను అవమానపరిచేలా పోస్టులు పెట్టా రంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం, గార్లపాడుకి చెందిన ముత్తన పల్లి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కూడా వేర్వేరుగా వర్మపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నింటిలో ముందస్తు బెయిల్ కోరుతూ వర్మ హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com