RGV : ఆర్జీవీకి హైకోర్టులో ఊరట

RGV : ఆర్జీవీకి హైకోర్టులో ఊరట
X

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆర్జీవీని ఆదేశించింది. రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags

Next Story