గుంటూరు జిల్లాలో రిగ్గింగ్‌.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది..

గుంటూరు జిల్లాలో రిగ్గింగ్‌.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది..
గ్రామంలోని 51, 52 పోలింగ్‌ బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆర్‌వో దగ్గర బ్యాలెట్‌ పేపర్లు తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు..

ప్రజాస్వామ్యంలో ఆయుధంగా చెప్పుకునే ఓటును కూడా స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదా..? పరిషత్‌ ఎన్నికల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఏపీలో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.. ఓటర్లు వేయాల్సి ఓటును అధికార పార్టీ నేతలే వేసుకుంటున్నారు.. ఓటర్లను రానివ్వకుండా, అధికారులను నోరెత్తనివ్వకుండా తమపని తాము చేసుకుపోతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించగా.. ఇక తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోకజవర్గంలో అధికార పార్టీ నేతలు ఓట్లు గుద్దుకుంటున్నారు..

క్రోసూరు మండలం ఉయ్యందనలో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు.. గ్రామంలోని 51, 52 పోలింగ్‌ బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆర్‌వో దగ్గర బ్యాలెట్‌ పేపర్లు తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు.. ఓటర్లు కనిపించాల్సిన పోలింగ్‌ కేంద్రంలో నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారు.. వారే ఓట్లేసుకుంటున్నారు.. బ్యాలెట్‌ పేపర్లపై ఫ్యాన్‌ గుర్తుపై ఒకరు స్టాంప్‌ వేసి ఇస్తుంటే.. మిగిలిన వారు బ్యాలెట్‌ బాక్సులో ఆ ఓట్లన్నీ వేసొస్తున్నారు..

దీనిని గమనించిన టీడీపీ నేతలు నలుగురిని పట్టుకున్నారు.. ఇంత యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పోలింగ్‌ కేంద్రం ఎదుట టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు..

Tags

Read MoreRead Less
Next Story