అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం లారీ తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు..

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం లారీ తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో.. తాడిపత్రి సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా తాడిపత్రికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story